నియంత్రిత (రిస్ట్రిక్టెడ్) స్టాక్ యూనిట్లు (RSU) అంటే ఏమిటి?

మీ పే ప్యాకేజీలో నియంత్రిత (రిస్ట్రిక్టెడ్) స్టాక్ యూనిట్ల (RSUల) చర్చతో గందరగోళం గా ఉన్నారా? అవి ఒక గోల్డెన్ టికెట్టా లేదా కేవలం ఫ్యాన్సీ వాగ్దానమా అని ఆశ్చర్యపోతున్నారా? RSU లు అంటే ఏమిటో అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా తెలుసుకుందాం.

ఉద్యోగి పనితీరు మరియు విధేయతను గుర్తించడానికి కంపెనీలు వివిధ రివార్డులను అందిస్తాయి. ఈ ప్రోత్సాహకాలు ఉద్యోగిలో ధైర్యాన్ని పెంచి అంకితభావాన్ని ప్రోత్సహిస్తాయి. నగదు బోనస్‌లు సాధారణం అయితే, కొన్ని వ్యాపారాలు కంపెనీలో రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల (RSU ల) ద్వారా ఉద్యోగులకు యాజమాన్యాన్ని మంజూరు చేస్తాయి. 

ఈ కింది విభాగాలలో, మనము RSU ల సిద్ధాంతాన్ని, అవి ఏమిటి మరియు అవి ఎందుకు ముఖ్యమైనవి అనే విషయాన్ని లోతుగా పరిశీలిద్దాము.

రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు లేదా RSU అంటే ఏమిటి?

RSU లు అనేవి కంపెనీ తమ ఉద్యోగికి ఇవ్వవలసిన ప్రతిఫలానికి బదులుగా అవి తమ స్టాక్ తాలూకు షేర్లను ఇచ్చే ఒక విధానం. అయితే, ఇందులో ఒక మెలిక ఉంటుంది: ఉద్యోగులు ఈ షేర్లను వెంటనే విక్రయించలేరు. ముందే నిర్వచించబడిన వెస్టింగ్ వ్యవధి ఉంటుంది, ఈ సమయంలో షేర్లు రిస్ట్రిక్ట్ చేయబడతాయి.

ఉద్యోగులు యాజమాన్య హక్కులను క్రమంగా సంపాదించేలా కంపెనీలు వెస్టింగ్ షెడ్యూల్‌లను ఏర్పాటు చేస్తాయి. ఈ షెడ్యూల్‌లు అనేవి సమయం మరియు పనితీరుకు మైలురాళ్లు లేదా రెండింటి కలయికపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, ఉద్యోగులు కంపెనీతో నిర్దిష్ట సంవత్సరాలు పని చేసిన తర్వాత లేదా నిర్దిష్ట పనితీరు లక్ష్యాలను సాధించడం ద్వారా వారి RSU లపై పూర్తి యాజమాన్యాన్ని పొందవచ్చు.

ఉద్యోగి కంపెనీతో ఎక్కువ కాలం ఉండేలా చెయ్యడం కోసంకంపెనీలు అలా చేస్తాయి. కొన్ని పరామితులు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే కంపెనీ ఉద్యోగికి వాటాదారుగా ఉండే అధికారాన్ని ఇవ్వగలదు. ఉదాహరణకు, సంబంధిత ఉద్యోగి నిర్ణయించిన పనితీరు మైలురాళ్లను ముందుగానే అధిగమిస్తే RSU ల కోసం వెస్టింగ్ వ్యవధి ముందుగానే ముగియవచ్చు. అదేవిధంగా, నిర్ణీత కాలం వరకు ఉద్యోగి అతని/ఆమె నిర్దిష్ట యజమానితో ఉన్న తర్వాత కూడా సమయంపై ఆధారపడిన వెస్టింగ్ వ్యవధి ముగియవచ్చు. 

రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు Vs స్టాక్ ఎంపికల గురించి మరింత చదవండి

RSU లపై పరిమితులు ఏమిటి?

రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు (RSU లు) వెస్టింగ్ షెడ్యూల్‌లతో వస్తాయి, ఇవి స్టాక్‌పై పూర్తి యాజమాన్యాన్ని పొందడానికి ఉద్యోగులు తప్పనిసరిగా అధిగమించవలసిన కొన్ని అడ్డంకులను సృష్టిస్తాయి. ఈ పరిమితులు దీర్ఘకాలికమైన నిబద్ధతను మరియు పనితీరును ప్రోత్సహిస్తాయి.

  1. సమయ-ఆధారిత (టైమ్ బేస్డ్) వెస్టింగ్: లాయల్టీ రివార్డ్ 

సాధారణ పరిమితి అనేది ఒక సమయ-ఆధారిత వెస్టింగ్. ఉద్యోగులు తప్పనిసరిగా ముందుగా నిర్ణయించిన వ్యవధి వరకు అంటే సాధారణంగా చాలా సంవత్సరాలు, RSU ల యొక్క నిర్ణీత కాల అవధికి ముందు వరకు కంపెనీతో ఉండాలి. ఇది విశ్వసనీయతను ప్రోత్సహిస్తుంది మరియు సంస్థ యొక్క దీర్ఘకాలిక విజయంతో ఉద్యోగి యొక్క ప్రయోజనాలను సమలేఖనం చేస్తుంది.

  1. పనితీరు ఆధారిత వెస్టింగ్: మైలురాళ్లను చేరుకోవడం

కొన్ని RSU లు నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి పనితీరు-ఆధారిత వెస్టింగ్‌ను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ ఒక సంవత్సరంలోపు నిర్దిష్ట విక్రయ లక్ష్యాన్ని అధిగమించిన తర్వాత RSU లను కలిగి ఉండవచ్చు. ఇది ఉద్యోగులను రాణించేలా ప్రేరేపిస్తుంది మరియు కంపెనీ లక్ష్యాలకు దోహదం చేస్తుంది.

  1. కంబైన్డ్ పరిమితులు: డబుల్ డ్యూటీ

కొన్ని సందర్భాల్లో, RSU లు సమయ-ఆధారిత మరియు పనితీరు-ఆధారిత పరిమితులను కలిగి ఉంటాయి. ఉద్యోగులు పూర్తి యాజమాన్యాన్ని పొందడానికి, నిర్ణయించిన సమయం వరకు కంపెనీతో ఉండి నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి రెండు షరతులను తప్పక నెరవేర్చాలి. ఈ విధానం ఉద్యోగుల పనితీరుకు మరియు కంపెనీ అభివృద్ధికి మధ్య ఉండే అమరికను బలపరుస్తుంది.

RSU లు కంపెనీ భవిష్యత్తులో ఉద్యోగులకు వాటాను మంజూరు చేస్తున్నప్పుడు, ఈ పరిమితులు సంస్థ యొక్క దీర్ఘకాలిక దృక్పధాన్ని ఉద్యోగులతో పంచుకునేలా చేస్తాయి. వెస్టింగ్ అవసరాలను నెరవేర్చడం ద్వారా, ఉద్యోగులు తమ RSU ల పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసుకొని కంపెనీలో కొంత భాగాన్ని నిజంగా స్వంతం చేసుకోవచ్చు.

RSU లతో ఏమి చేయాలి?

RSU ల నిర్ణీత అవధి తర్వాత, ఉద్యోగులు తమ షేర్లను విక్రయించడానికి మరియు గణనీయమైన లాభాలను పొందడానికి అవకాశాన్ని పొందుతారు. అయితే, విక్రయించాలనే నిర్ణయాన్ని నేరుగా తీసుకోలేరు. 

కొంతమంది ఉద్యోగులకు, ముఖ్యంగా అస్థిర కంపెనీ స్టాక్ ఉన్నవారికి, అన్ని వెస్టెడ్ షేర్లను విక్రయించడం అనేది తెలివైన పని. హెచ్చుతగ్గుల వల్ల హోల్డింగ్ నుండి లాభాలు వచ్చే అవకాశాలను పోగొట్టుకోవచ్చు. 

మరోవైపు, స్టాక్ ధర ఇప్పటికే ఎక్కువగా ఉంటే, అది మరింత పెరగకపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో, హోల్డింగ్ అనేది ఒక మంచి వ్యూహం కావచ్చు.

అంతిమంగా, వెస్టెడ్ RSU లను విక్రయించాలా వద్దా అనే నిర్ణయం వ్యక్తిగత పరిస్థితులు మరియు రిస్క్ టాలరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఎంపికతో సంబంధం లేకుండా, RSUలు ఉద్యోగులకు గణనీయమైన లాభాలను అందిస్తాయి. 

రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లపై పన్ను

కింది పట్టిక వివిధ పరిస్థితులకు అనుగుణంగా RSU లబ్ధిదారునికి గల పన్ను బాధ్యతలను చూపుతుంది –

పరిస్థితి పన్ను బాధ్యత
వెస్టింగ్ చేసిన తర్వాత RSU అటువంటి షేర్లను పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి జోడించిన తర్వాత చెల్లించాలి.
RSU ను పొందడం జీరో పన్ను.
RSU లను స్వాధీనం చేసుకున్న 2 సంవత్సరాలలోపు విక్రయించడం ఆదాయపు మొత్తానికి అమ్మకపు విలువ జోడించబడుతుంది మరియు వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుంది.
RSU లను స్వాధీనం చేసుకున్న 2 సంవత్సరాల తర్వాత విక్రయించడం ఇండెక్సేషన్ సౌకర్యంతో పాటు దీర్ఘకాలిక మూలధన లాభాల నిబంధనల ప్రకారం పన్నులు వర్తిస్తాయి. 

RSU ల యొక్క ప్రయోజనాలు

రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు (RSUలు) యజమానులు మరియు ఉద్యోగులు ఇద్దరికీ తప్పనిసరి ప్రోత్సాహక ప్యాకేజీని అందిస్తాయి. ఇక్కడ కొన్ని ముఖ్య ప్రయోజనాలను నిశితంగా పరిశీలించండి:

  1. మెరుగైన నిలుపుదల: RSU లు ఉద్యోగికి మరియు కంపెనీకి మధ్యన దీర్ఘకాలిక నిబద్ధతను సృష్టిస్తాయి. వెస్టింగ్ షెడ్యూల్, సంస్థ యొక్క విజయంలో పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది, చాలా సంవత్సరాల పాటు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగుల టర్నోవర్‌ను (కంపెనీని వదిలి వెళ్ళి పోయే వారి సంఖ్యను) తగ్గించి శ్రామికశక్తి మరింత స్థిరంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.
  2. ప్రేరణ మరియు పనితీరు: కంపెనీలో యాజమాన్యాన్ని మంజూరు చేయడం ద్వారా, RSU లు నేరుగా కంపెనీ పనితీరుతో ముడిపడిన రివార్డులను ఉద్యోగికి అందజేస్తాయి. ఈ అమరిక ఉద్యోగులను అదనపు మైలుకు వెళ్లడానికి (అదనంగా పనిలో నైపుణ్యాన్ని జోడించడానికి) ప్రోత్సహిస్తుంది, ఉత్పాదకతను పెంచడానికి మరియు మొత్తంగా కంపెనీ యొక్క విజయానికి దోహదపడుతుంది.
  3. మూల ధన లాభాల (క్యాపిటల్ గెయిన్స్)కు గల అవకాశాలు: ఉద్యోగులు తమ RSU లను పూర్తిగా వెస్ట్ చేసే వరకు హోల్డ్ చేసుకున్నప్పుడు, వారు గణనీయమైన మూలధన లాభాలను పొందే అవకాశం ఉంటుంది, ప్రత్యేకించి వెస్టింగ్ కాలంలో కంపెనీ స్టాక్ ధర పెరిగితే. ఈ భాగస్వామ్య యాజమాన్యం భాగస్వామ్య భావాన్ని పెంపొందిస్తుంది మరియు కంపెనీ యొక్క దీర్ఘకాలిక వృద్ధికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకునేలా ఉద్యోగులను ప్రేరేపిస్తుంది.
  4. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు తగ్గుతాయి: స్టాక్ ఎంపికల వలె కాకుండా, RSU లు వ్యక్తిగత షేర్లను ట్రాక్ చేయవలసిన మరియు రికార్డ్ చేయవలసిన అవసరం కంపెనీలకు ఉండదు. ఇది కంపెనీకి అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు తగ్గడానికి దారి తీస్తుంది, ఇది ఖర్చులను మరింత ప్రయోజనకరమైన-పద్ధతిలో ఉండేలా చేసి ఉద్యోగికి ఒక ప్రోత్సాహక కార్యక్రమంగా మారుతుంది. 

RSU ల యొక్క ప్రతికూలతలు 

RSU లు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి:

  1. జప్తు ప్రమాదం (ఫర్ఫీచర్ రిస్క్): తమ RSU ల నిర్ణిత కాలానికి ముందుగానే కంపెనీని విడిచిట్టే ఉద్యోగుల అన్‌వెస్ట్ చేయని షేర్లు జప్తు చేయబడతాయి. ఇది ఒక ప్రధానమైన లోపంగా ఉంటుంది, ప్రత్యేకించి ఊహించని విధంగా నిష్క్రమించే లేదా వెస్టింగ్ వ్యవధి మధ్యలో ఇతర అవకాశాలను కొనసాగించాలని నిర్ణయించుకున్న ఉద్యోగులకు.
  2. లిక్విడిటీ మరియు డివిడెండ్ లేకపోవడం: వాస్తవ కంపెనీ స్టాక్ వలె కాకుండా, RSU లు సాధారణ డివిడెండ్ చెల్లింపులను అందించవు. అదనంగా, ఉద్యోగులు తమ RSU లను పూర్తిగా వెస్ట్ చేసే వరకు స్వేచ్ఛగా విక్రయించలేరు, తక్షణ ఆర్థిక ప్రయోజనాలకు వాటి లభ్యతను పరిమితం చేస్తారు. స్వల్పకాలిక ఆర్థిక అవసరాల కోసం వాటి పరిహారంపై ఆధారపడే ఉద్యోగులకు ఇది ప్రతికూలంగా ఉంటుంది.
  3. అనిశ్చితి మరియు ఆధారపడటం: RSU ల విలువ నేరుగా కంపెనీ స్టాక్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. వెస్టింగ్ వ్యవధిలో స్టాక్ ధర పడిపోతే, ఉద్యోగులు ముందుగా ఊహించిన దాని కంటే తక్కువ విలువ గల షేర్లను పొందవచ్చు. అనిశ్చితి యొక్క ఈ లక్షణం కొంతమంది ఉద్యోగులకు ఒక లోపంగా ఉంటుంది.

RSU ల యొక్క ఉపయోగాలను మరియు నష్టాలను రెండింటినీ అర్థం చేసుకోవడం ద్వారా, కంపెనీలు మరియు ఉద్యోగులు ఈ రకమైన పరిహారం వారి లక్ష్యాలు మరియు రిస్క్ టాలరెన్స్‌తో సరిపోతుందా అనే దాని గురించి వారికి తెలియజేయబడిన సమాచారం ప్రకారం నిర్ణయాలను తీసుకోవచ్చు.

ఆఖరి మాట

ఇప్పుడు మీరు RSU అర్థం మరియు RSU ల విలువను అర్థం చేసుకున్నారు, ఏంజెల్ వన్‌తో ఉచిత డీమ్యాట్ ఖాతాను తెరవడం ద్వారా మీరు ఇతర పబ్లిక్‌గా ట్రేడ్ చేయబడిన స్టాక్‌లలో ఎలా పెట్టుబడి పెట్టవచ్చో చూడండి!

FAQs

RSU లు అంటే ఏమిటి?

RSU లు (పరిమితం చేయబడిన స్టాక్ యూనిట్లు) అనేది ఒక కంపెనీ దాని స్టాక్ యాజమాన్యాన్ని మీకు మంజూరు చేసే ఒక రకమైన పరిహారం. వెస్టింగ్ వ్యవధి ముగిసే వరకు మీరు వాటిని విక్రయించలేరు.

కంపెనీలు RSU లను ఎందుకు ఇస్తాయి?

కంపెనీలు తమ ఉద్యోగులు తమతో దీర్ఘకాలం ఉండటానికి మరియు కంపెనీ విజయం కోసం పని చేయడానికి ఉద్యోగులను ప్రోత్సహించడానికి RSU లను ఉపయోగిస్తాయి. కంపెనీలో కొంత భాగాన్ని సొంతం చేసుకోవడం ద్వా రా మీ లక్ష్యాలు వారి లక్ష్యాలతో సమలేఖనం చేయబదతాయి.

RSU లు వెస్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

వెస్టింగ్ షెడ్యూల్‌లు మారుతూ ఉంటాయి, సాధారణంగా కొన్ని సంవత్సరాల నుండి మొత్తం ఉద్యోగ కాలం వరకు ఉంటాయి. మీరు కాలక్రమేణా యాజమాన్య హక్కులను క్రమంగా పొందుతారు.

నేను నా RSU ల వెస్ట్‌కి ముందే వెళ్లిపోతే ఏమి జరుగుతుంది?

దురదృష్టవశాత్తూ, వెస్టింగ్ వ్యవధి ముగిసేలోపు మీరు కంపెనీని విడిచిపెట్టినట్లయితే, మీరు ఏవైనా అన్‌వెస్ట్ చేయని RSU లను కోల్పోతారు.

RSU ల యొక్క పన్ను చిక్కులు ఏమిటి?

మీ వెస్టెడ్ RSU లను వెస్ట్ చేసినప్పుడే వాటి సరసమైన మార్కెట్ విలువపై మీకు పన్ను విధించబడుతుంది, కానీ వాటిని మీరు విక్రయించినప్పుడు కాదు. వాటిని ఉంచుకోవాలా లేదా అమ్మివేయాలా అనే  నిర్ణయయం తీసుకునేటప్పుడు పన్నులు విద్దించబడే అవకాశాలను పరిగణనలోకి తీసుకోండి.