స్టాప్ లాస్ ఒక నిర్దిష్ట ట్రేడ్ పై మీరు ఎంత కోల్పోతారో తెలిపే ఒక చర్యగా పనిచేస్తుంది. ఒక ట్రేడ్ దాని దిశను మార్చినట్లయితే మీరు సిద్దంగా ఉండుటకు ముందస్తుగానే స్టాప్ లాస్ లెక్కించడం ముఖ్యం. ఒక స్టాక్ ధర ఊహించిన కదలిక నుండి తప్పు దిశలోనికి మారుతూ ట్రేడ్ ని లాభదాయకంగా కాకుండా చేసేటటైతే, ఆ నష్టాన్ని తగ్గించడానికి ఒక స్టాప్ లాస్ సహాయపడుతుంది.
స్టాప్ లాస్ ఎలా పనిచేస్తుంది?
ఒక ఇంట్రాడే ట్రేడర్ తన ట్రేడ్ కి ముందుగానే స్టాప్ లాస్ లెవెల్ ని కేటాయిస్తారు. ధర స్టాప్ లాస్ స్థాయికి చేరుకున్నప్పుడు, ఆటోమేటిక్గా లావాదేవీ మూయబడుతుంది . ఆమె పెట్టుబడి పెట్టిన మిగిలిన డబ్బును ట్రేడర్ ఆదా చేయగలరు. కోల్పోయిన ఫండ్స్ యొక్క రాబడి కోసం ఒక ప్లాన్ సిద్ధం చేయడం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా, స్టాప్ లాస్ ఆర్డర్ ఎంచుకోవడం వలన చెడు ట్రేడ్, చెత్త ట్రేడ్ గా మారకుండా నిరోధిస్తుంది.
స్టాప్ లాస్ ని ఎలా లెక్కించాలి?
ఒక ట్రేడ్ లో స్టాప్ లాస్ ఎలా కనిపిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ప్రస్తుతం ₹104 వద్ద ట్రేడ్ అవుతున్న ఒక స్టాక్ కొనుగోలు చేయాలనుకుంటే, మీరు మీ స్టాప్ లాస్ ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో ఇప్పుడు నిర్ణయించుకోవాలి. ₹100 క్రిందగా స్టాప్ లాస్ ని ₹98 వద్ద ఉంచడం అనేది ఒక మంచి నంబర్. ఈ నిర్దిష్ట ట్రేడ్ లో ₹6 పోగొట్టుకోవడంలో మీరు తయారుగా ఉన్నారని సూచిస్తుంది, అయితే, నష్టం దాని కంటే ఎక్కువ అయితే లావాదేవీ రద్దు అవుతుంది.
అదనంగా, మీ లాభం టార్గెట్ ఎల్లప్పుడూ స్టాప్ లాస్ శాతానికి 1.5 రెట్లు ఉండాలి. ఈ ఉదాహరణలో, స్టాప్ లాస్ ₹6, మీరు దానిని కోల్పోవడానికి సిద్ధపడి ఉన్నారు. అందువల్ల, మీ కనీస లాభం ₹9 ఉండాలి, ఇది మీరు ₹104 + ₹9 = ₹113 వద్ద ఉంచాలి.
నా స్టాప్ నష్టం స్థాయిని ఎక్కడ సెట్ చేయాలి?
చాలా ప్రారంభ ట్రేడర్లు వారి స్టాప్ లాస్ ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించడానికి కష్టపడతారు. ఒకవేళ ఎవరైనా తన స్టాప్ లాస్ చాలా దూరంగా సెట్ చేస్తే, స్టాక్ తప్పు దిశలో వెళ్తున్నప్పుడు ఆమె చాలా డబ్బు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా , కొనుగోలు ధరకు సమీపంలో తమ స్టాప్ లాస్ ని ఏర్పాటు చేసిన ట్రేడర్లు వారి ట్రేడ్ నుండి త్వరగా తీసివేయబడినందున డబ్బు నష్టపోతారు .
ఎవరైనా ప్రతి ట్రేడ్ కోసం స్టాప్ లాస్ ని లెక్కించడానికి వివిధ వ్యూహాలను ఉపయోగించవచ్చు. ఈ వ్యూహాలు మూడు పద్ధతులు, మీరు మీ స్టాప్ లాస్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించుకోవచ్చు:
1. పర్సెంటేజ్ పద్దతి
2. సపోర్ట్ పద్ధతి
3. మూవింగ్ ఆవెరేజ్ పద్ధతి
పర్సెంటేజ్ పద్ధతిని ఉపయోగించి స్టాప్ లాస్ ని లెక్కించండి
స్టాప్ లాస్ లెక్కించడానికి పర్సెంటేజ్ పద్ధతిని సాధారణంగా ఇంట్రాడే ట్రేడర్స్ ఉపయోగిస్తారు. పర్సెంటేజ్ పద్ధతిలో, ట్రేడ్ నుండి నిష్క్రమించడానికి ముందు వారు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న స్టాక్ ధర యొక్క పర్సెంటేజ్ ను కేటాయించవలసి ఉంటుంది.
ఉదాహరణకు, మీరు మీ ట్రేడ్ నుండి నిష్క్రమించడానికి ముందు మీ స్టాక్ విలువ లో 10% పోగొట్టుకోవడానికి మీరు సిద్ధపడి ఉన్నారు అనుకుందాం. అదనంగా, మీ షేర్ ₹50 వద్ద ట్రేడింగ్ అవుతుంది అనుకోండి. అప్పుడు, మీ స్టాప్ లాస్ ₹45 వద్ద సెట్ చేయాలి — ప్రస్తుత స్టాక్ ధర కన్నా₹5 తక్కువ (₹50 x 10% = ₹5).
సపోర్ట్ పద్ధతిని ఉపయోగించి స్టాప్ లాస్ ని లెక్కించండి
పర్సెంటేజ్ పద్ధతితో పోలిస్తే, సపోర్ట్ పద్ధతిని ఉపయోగించి స్టాప్ లాస్ ని లెక్కించడం ఇంట్రాడే ట్రేడర్లకు కొద్దిగా కష్టం. అయితే, అనుభవం ఉన్న ఇంట్రాడే ట్రేడర్లు దీన్ని ఉపయోగించడం తెలిసి ఉంటారు. ఈ పద్ధతిని ఉపయోగించడానికి, మీరు మీ స్టాక్ యొక్క అత్యంత ఇటీవలి సపోర్ట్ స్థాయిని తెలుసుకోవాలి.
సపోర్ట్ ఒక ప్రాంతం అంటే స్టాక్ ధర ఎక్కడైతే తరచుగా పడిపోవడం ఆగిపోతుందో అది, మరియు నిరోధక ప్రాంతం అంటే స్టాక్ ధర ఎక్కడైతే తరచుగా పెరగడం ఆగిపోతుందో అది. ఒకసారి మీ మద్దతు స్థాయి నిర్ణయించబడిన తర్వాత, మీరు సపోర్ట్ స్థాయి క్రింద మీ స్టాప్ లాస్ ధరను ఉంచవలసి ఉంటుంది. మీరు కలిగిన్ షేర్ ప్రస్తుత ట్రేడింగ్ ధర ₹500 మరియు మీరు గుర్తించగలిగే అత్యంత ఇటీవలి సపోర్ట్ స్థాయి ₹440 అని భావిస్తే, మీ స్టాప్ లాస్ ₹440 కన్నా కొద్దిగా క్రింద సెట్ చేయవలసిందిగా సిఫార్సు చేయబడింది.
సపోర్ట్ మరియు నిరోధక స్థాయిలు రెండూ ఎల్లప్పుడూ అంత ఖచ్చితంగా ఉండవు. నిష్క్రమించడానికి ట్రిగ్గర్ వేయడానికి ముందు, మీ స్టాక్ కిందికి వచ్చి ఆ తర్వాత సపోర్ట్ స్థాయికి తిరిగి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ స్టాక్ కు కొంచం పైకి కిందకి వెళ్ళడానికి కదిలే స్థలం ఇవ్వండి. మీరు మీ ట్రేడ్ నుండి నిష్క్రమించడానికి ఎంచుకునే ముందు బార్ కొద్దిగా సపోర్ట్ స్థాయికి క్రింద సెట్టింగ్ చేయడం వలన మీరు మీ స్టాక్ కు కొంచెం కదిలే స్థలం ఇవ్వవచ్చు.
మూవింగ్ ఆవెరేజ్ పద్ధతిని ఉపయోగించి స్టాప్ లాస్ లెక్కించండి
ఇంట్రాడే ట్రేడర్లకు స్టాప్ లాస్ ఎక్కడ సెట్ చేయాలో నిర్ణయించడానికి సపోర్ట్ పద్ధతితో పోలిస్తే సగటు పద్ధతే సులభం. మొదట, స్టాక్ చార్ట్ కు మూవింగ్ ఆవెరేజ్ వర్తింపవలసి ఉంటుంది. ఒక దీర్ఘకాలిక మూవింగ్ ఆవెరేజ్ బాగా మంచిది ఎందుకంటే ఇది మీ స్టాక్ ధరకు చాలా దగ్గరగా మరియు మీ ట్రేడ్ నుండి త్వరగా తొలగించబడటను నివారిస్తుంది కాబట్టి. ఒకసారి మూవింగ్ ఆవెరేజ్ పెట్టిన తర్వాత, మూవింగ్ ఆవెరేజ్ లెవల్ క్రింద మీ స్టాప్ లాస్ ని సెట్ చేయండి, ఎందుకంటే దిశను మార్చడానికి ఇది మరింత కదలిక స్థలం కలిగి ఉంటుంది.